![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -821 లో.. రిషిని అటాక్ చెయ్యమని శైలేంద్ర ఒక రౌడీని రిషి దగ్గరికి పంపిస్తాడు. రిషి హాల్లో కూర్చొని ఫోన్ చూస్తుంటాడు. రౌడీ కత్తి పట్టుకొని రిషి వెనకాల నుండి వచ్చి పొడుస్తుండగా.. అది చూసిన వసుధార వచ్చి రిషిని నెట్టివేస్తుంది.
"సర్ మీకేం కాలేదు కదా" అని వసుధార అడుగుతుంది. లేదు నువ్వు ఒకే కదా అని రిషి అడుగుతాడు. రౌడీ ని పట్టుకోవాలని రిషి వెనకాలే వెళ్తాడు. రౌడీ తప్పించుకుంటాడు. ఇలా రౌడీ వచ్చి అటాక్ చేసినట్లు ఏంజిల్, విశ్వనాథ్ గారికి చెప్పొద్దు తెలిస్తే కంగారుపడుతారని వసుధార, సెక్యూరిటికి చెప్తాడు రిషి. ఆ తర్వాత వసుధార జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తుంటుంది. ఇన్ని రోజులుగా లేనిది రిషి సర్ పై అటాక్ ఏంటి జగతి మేడం మహేంద్ర సర్ మా దగ్గరికి వచ్చిన విషయం శైలేంద్రకి తెలిసిపోయిందా అని వసుధార అనుకొని మహేంద్రకి కాల్ చేస్తుంది. మహేంద్రకి ఫోన్ చేసి సర్ మీరు వచ్చిన విషయం ఎవరికైనా తెలుసా అని వసుధార అడుగుతుంది. లేదు జగతికి నాకు తప్ప ఎవరికీ తెలియదని మహేంద్ర అంటాడు. ఇక వసుధార రిషి పై జరిగిన అటాక్ గురించి మహేంద్రకి చెప్పగానే కంగారుపడుతాడు. మేం ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పకండని మహేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార ఫోన్ కట్ చేసాక రిషి వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నారు మేడమ్. మీ మేడమ్ తోనా అని రిషి అడుగుతాడు. మళ్ళీ ఏం చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు చేసింది చాలని రిషి ఆవేశపడతాడు. సర్ మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారు. మేం మీ గురించి అలా చేశామని, ఆ విషయం ఇప్పుడు మేం చెప్తే, మీరు ఇలా కవర్ చేస్తున్నారా అని అంటారు కాబట్టి చెప్పట్లేదు. మీ అంతటా మీరే తెలుసుకున్న రోజు ఇలా మాట్లాడరని వసుధార అంటుంది. నేను మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకోవటం లేదు. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. మీరు చేస్తారు.. నాకు నమ్మకం ఉందని అని వసుధార అనుకుంటుంది.
మరొకవైపు దేవయాని, శైలేంద్రకు ఫోన్ చేసి.. రిషి ఉంటే DBST కాలేజీ నీది కాదు. రిషి రాకుండా చూడని చెప్తుంది. మరొకవైపు రిషిపై అటాక్ గురించి వసుధార చెప్పినదంతా జగతికి చెప్తాడు మహేంద్ర. జగతి షాక్ అవుతుంది. ఈ అటాక్ శైలేంద్ర చేయించి ఉంటాడా అని మహేంద్ర అనగానే.. బాబాయ్ అంటూ శైలేంద్ర పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |